Breaking: భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 03:10 PM

ప్రముఖ భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ నేడు కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ (95) నేడు ఉదయమే తుది శ్వాస విడిచారు. ఈ నెల 8న ఆయన ఆసుపత్రిలో చేరినప్పటికీ కూడా, అప్పటికే ఆరోగ్యం అంతా క్షీణించిందని, ఫార్టిస్ ఆసుపత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు. కాగా ఆయనను కాపాడటానికి వైద్యులు ఎంతగానో శ్రమించినప్పటికీ కూడా ఫలితం లేకుండాపోయిందని వైద్యులు ఈ మేరకు వెల్లడించారు.

కాగా ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనదని, అంతేకాకుండా 1952లో జరిగిన ఒలింపిక్స్ హాకీ ఫైనల్ ‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన వ్యక్తిగా బల్బీర్ సింగ్ చరిత్ర సృష్టించారని చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో 1957లో భారత ప్రభుత్వం బల్బీర్‌ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.





Untitled Document
Advertisements