అదిరిపోయే బడ్జెట్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన షియోమీ

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 03:58 PM

అదిరిపోయే బడ్జెట్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన షియోమీ

షియోమీ మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల టీవీ ఈ32ఎస్ స్మార్ట్ టీవీని షియోమీ చైనాలో లాంచ్ చేసింది. ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను అందించారు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో బెజెల్ లెస్ డిజైన్, ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ లను కూడా అందించారు. అయితే ఈ టీవీ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో షియోమీ తెలపలేదు.

ఈ టీవీ ధరను షియోమీ 899 యువాన్లుగా(సుమారు రూ.9,500) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ టీవీ బ్లాక్ కలర్ వేరియంట్ ఎంఐ స్టోర్ చైనా సైట్, జేడీ.కాంల్లో అందుబాటులో ఉంది. ఇదే సిరీస్ లో ఎంఐ టీవీ ఈ43కే 1,099 యువాన్ల ధరకే లాంచ్ అయింది.

ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే. .ఈ టీవీలో 32 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గా ఉండగా, బెజెల్ లెస్ డిజైన్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత షియోమీ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. క్వాడ్ కోర్ ఏఆర్ఎం కార్టెక్స్ ఏ-53 ప్రాసెసర్ ను ఇందులో అందించారు.

1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ టీవీలో షియోఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. వాయిస్ కంట్రోల్ ను సపోర్ట్ చేసే బ్లూటూత్ రిమోట్ ను అందించనున్నారు. బ్లూటూత్ రిమోట్ ప్యాకేజ్ తో పాటు రానుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 6W స్పీకర్లను అందించారు. బ్లూటూత్ వీ4.0, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, డీటీఎస్ డీకోడర్ ఫీచర్లు ఉన్నాయి. రెండు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీ పోర్టు, ఏవీ ఇన్ పుట్, ఎస్/పీడీఐఎఫ్ పోర్టులు, ఒక యాంటెన్నా పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. దీని బరువు స్టాండ్ తో కలిపి 3.77 కేజీలుగా ఉంది.





Untitled Document
Advertisements