గంగూలీ-ద్రవిడ్: తొలి 300+ రన్స్ భాగస్వామ్యానికి @21 ఏళ్ళు!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 04:07 PM

గంగూలీ-ద్రవిడ్:  తొలి 300+ రన్స్ భాగస్వామ్యానికి @21 ఏళ్ళు!

1999 వ‌న్డే ప్ర‌పంచ‌కప్‌లో భార‌త క్రికెట‌ర్లు సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్ త‌మ కెరీర్లోనే మ‌రిచిపోలేని రికార్డును జంట‌గా న‌మోదు చేశారు. 21 ఏళ్ల కిందట శ్రీలంక‌తో జ‌రిగిన చావోరేవోలాంటి మ్యాచ్‌లో వీరిద్ద‌రూ శివ‌మెత్తారు. లంకను చిత‌గ్గొట్టి రెండో వికెట్‌కు 318 ప‌రుగులు జోడించారు. అప్ప‌టికి వన్డేల్లో 300+ ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోద‌వ్వ‌డం అదే తొలిసారి కావ‌డం విశేషం. ఈ మ్య‌చ్‌లో గంగూలీ (183) కెరీర్ హ‌య్యెస్ట్ స్కోరు నమోదు చేసుకోగా.. ద్ర‌విడ్ (145) రెండో అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోరును సాధించాడు.అంత‌కుముందు టోర్నీలో కేవ‌లం కెన్యాపై గెలిచిన భార‌త్.. ద‌క్షిణాఫ్రికా జింబాబ్వే చేతుల్లో ఓడిపోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో బ‌రిలోకి దిగిన భార‌త్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభ ఓవ‌ర్లోనే శ‌ఠ‌గోప‌న్ ర‌మేష్ వికెట్‌ను కోల్పోయిన భార‌త్‌ను గంగూలీ.. ‌ద్ర‌విడ్ జోడీ ఆదుకుంది. వీరి దూకుడుతో ఇండ‌యా 373/6తో భారీ స్కోరు సాధించింది.అనంత‌రం రాబిన్ సింగ్ ఐదు వికెట్లతో రాణించ‌డంతో లంకను భార‌త్ క‌ట్ట‌డి చేసింది. ఈ క్ర‌మంలో 157 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర్చుకున్నభార‌త్.. సూప‌ర్ సిక్స్‌కు అర్హ‌త సాధించింది. అయితే ఆ ద‌శ‌లో నిరాశ‌ప‌ర్చిన ఇండియా ఆఖ‌రిస్థానాన్ని ద‌క్కించుకుంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారి బ‌రిలోకి దిగిన గంగూలీ, ద్ర‌విడ్ త‌ర్వాతి కాలంలో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు నేతృత్వం వ‌హించడం విశేషం.






Untitled Document
Advertisements