10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంజిమామ్‌ని ఔట్ చేయలేకపోయా: సోయాబ్

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 07:07 PM

10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంజిమామ్‌ని ఔట్ చేయలేకపోయా: సోయాబ్

పాకిస్థాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది టాప్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందిపెట్టాడు. ముఖ్యంగా.. అతను పాదాల వద్ద విసిరే యార్కర్లకి చాలా మంది బ్యాట్స్‌మెన్‌ల వద్ద సమాధానమే అప్పట్లో లేకపోయింది. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3 కిమీ వేగంతో బంతి విసిరిన షోయబ్ అక్తర్.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 178 వికెట్లు, వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టిన షోయబ్ అక్తర్.. పాకిస్థాన్ దిగ్గజ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ని కనీసం ఒక్కసారి కూడా నెట్స్‌లో బౌల్డ్ చేయలేకపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ స్వయంగా వెల్లడించాడు. ‘‘ఇంజిమామ్ ఉల్ హక్ నా బౌలింగ్ యాక్షన్‌ని అప్పట్లో బాగా చదివేశాడు. సెకన్ల వ్యవధిలోనే అతను నేను వేయబోతే బంతిని అంచనా వేసి.. ఎదుర్కొనేవాడు. ఎంతలా అంటే..? దాదాపు 10 ఏళ్ల పాటు అతనికి నెట్స్‌లో నేను బౌలింగ్ చేశాను. కానీ.. కనీసం ఒక్కసారి కూడా అతడ్ని బౌల్డ్ చేయలేకపోయాను’’ అని షోయబ్ అక్తర్ వెల్లడించాడు.






Untitled Document
Advertisements