ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని

     Written by : smtv Desk | Fri, May 29, 2020, 06:13 PM

ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని

తోటి విద్యార్థితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని గర్భం వస్తుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాఠశాలలో తనతో చదువుకున్న బాలుడితో ఆ బాలిక (14) ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అయితే గర్భం వస్తుందేమోనని ఆ బాలిక ఆందోళన చెందింది. గురువారం తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో చీరతో ఫ్యాన్‌ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా ఉంది. వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందిన సమాచారం మేరకు మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మహాలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతిపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని కేజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనకు కారకుడిగా భావిస్తున్న బాలుడిని స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. ఈ కేసును మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఉదయ్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements