సచిన్ టెండూల్కర్ కొడుకు నెపొటిజం సెగ

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 01:51 PM

సచిన్ టెండూల్కర్ కొడుకు నెపొటిజం సెగ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత ఇండస్ట్రీలోని నెపొటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు బంధుప్రీతితో ప్రతిభ ఉన్న యాక్టర్స్‌ని తొక్కేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుండగా.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు క్రికెట్‌లోనూ అదే ధోరణి కొనసాగుతోందని సోషల్ మీడియాలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
నాలుగేళ్ల క్రితం 327 బంతుల్లో 1,009 పరుగులు చేసిన ముంబయి యువ సంచలన బ్యాట్స్‌మెన్ ప్రణవ్ ధన్వాడే‌ ఇప్పుడు కనుమరైపోయాడు. దానికి కారణం సచిన్ టెండూల్కర్ అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016లో అండర్-16 వెస్ట్‌జోన్ టీమ్‌కి ప్రణవ్‌కి బదులుగా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. దాంతో.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక ఆటో డ్రైవర్ కొడుకు వెలుగులోకి రావడాన్ని అప్పట్లో ముంబయి క్రికెట్‌లోని పెద్దలు జీర్ణించుకోలేకపోయారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి.
బాలీవుడ్ నెపొటిజం గురించి తాజాగా చర్చ జరుగుతుండటంతో మరోసారి అర్జున్ టెండూల్కర్ vs ప్రణవ్ ధన్వాడె వివాదం తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ వివాదంపై ప్రణవ్ తండ్రి మాట్లాడుతూ అర్జున్ టెండూల్కర్, ప్రణవ్ మంచి స్నేహితులని వారి మధ్య విభేదాలు తీసుకురావొద్దని సూచించాడు. మరోవైపు ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ).. ప్రణవ్ ఆ ఇన్నింగ్స్ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ కనబర్చలేదని చెప్పుకొచ్చింది. మొత్తంగా.. ఇప్పుడు ప్రణవ్ కనుమరుగైపోయాడు.






Untitled Document
Advertisements