షాక్: పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధర పెంపు

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 01:54 PM

షాక్: పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధర పెంపు

పోకో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగింది. అయితే 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధర మాత్రం పెరగలేదు. పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధరలో మొదటి సారి ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెరిగాయి. గత నెలలో మళ్లీ 6 జీబీ ర్యామ్ వేరియంట్ల ధర పెరిగింది. ప్రస్తుతం పోకో ఎక్స్2 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499గా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ.20,999గా ఉండేది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.19,999గా ఉండేది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో జీఎస్టీ పెంపు కారణంగా రూ.1,000 పెరిగింది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.17,499 గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499గానూ ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ను కూడా ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

పోకో ఎక్స్2లో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్ తో పాటు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్. 27W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 68 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ గా చార్జ్ అయిపోతుంది. 4జీ వోల్టే, వైఫై యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. పోకో ఎక్స్2లో హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది.





Untitled Document
Advertisements