రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా ఫుల్ సపోర్ట్

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 04:36 PM

రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా ఫుల్ సపోర్ట్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి ధోనీ దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి సెలక్టర్లు వరుస అవకాశాలిచ్చారు. అయితే.. పంత్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవగా.. కేఎల్ రాహుల్ ఎవరూ ఊహించనిరీతిలో క్లిక్ అయ్యాడు. కానీ.. రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ ఎక్కువ సపోర్ట్ ఇస్తోందని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
‘‘రిషబ్ పంత్ గత ఏడాది గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి సపోర్ట్‌గా నిలుస్తోంది. దానికి కారణం పంత్ స్పెషల్ ప్లేయర్ అని నమ్మడమే. ఒక్కసారి అతను టచ్‌లోకి వస్తే.. ఆ తర్వాత నిలకడగా పరుగులు రాబట్టగలడు. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. దానికితోడు వరుస ఫెయిల్యూర్స్ కారణంగా రిషబ్ పంత్ ఒత్తిడిలో ఉన్నాడు. కానీ.. ఇలాంటి ఎదురుదెబ్బలే అతడ్ని మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి’’ అని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.

షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. ఈ టోర్నీకి ముందు జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవాలని ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ రెండు టోర్నీలపైనా సందిగ్ధత నెలకొంది.





Untitled Document
Advertisements