ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోని

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 09:07 PM

ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నుంచి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. అక్కడే తన కూతురు జీవాతో కలిసి బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. అటు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ధోనీ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.రాంచీలోని ధోనీ ఫామ్‌హౌస్ విస్తీర్ణం ఏడు ఎకరాలుకాగా.. అందులో కొంతమేర ఇల్లు కట్టుకున్న ధోనీ.. చాలా వరకూ ఖాళీగా వదిలేశాడు. దాంతో.. ఇప్పుడు కరోనా కారణంగా దొరికిన బ్రేక్ సమయాన్ని వినియోగించుకుంటున్న ధోనీ.. ఆ ఖాళీ స్థలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ అంటే అమితంగా ఇష్టపడే ధోనీ.. స్వయంగా ట్రాక్టర్‌తో నేలని చదును చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడగా.. ధోనీ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది.






Untitled Document
Advertisements