రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు... ఒక్కరోజే 1087..!

     Written by : smtv Desk | Sun, Jun 28, 2020, 10:31 AM

తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న కేసుల సంఖ్య మరో రికార్డ్ క్రియేట్ చేసింది. నిన్న ఒక్కరోజే 1087 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో 6 మంది చనిపోయారు.


అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 74 కేసులు, మేడ్చల్‌లో 37 కేసులు, నల్గొండలో 35 కేసులు, సంగారెడ్డిలో 11 కేసులు, వరంగల్ అర్బన్‌లో 7 కేసులు, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 5 కేసులు, నాగర్‌కర్నూల్, జనగాంలో 4 కేసులు, సిరిసిల్లలో 3 కేసులు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెంలో రెండేసి కేసులు, అసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాల ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,436కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 8,265 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 4,928 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 243కి చేరింది.

ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 3,923 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 2,836 మందికి నెగిటివ్ రాగా, 1,087 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 79,231 టెస్ట్‌లు చేసినట్లు తెలిపింది.





Untitled Document
Advertisements