ఐఫోన్ బాక్స్ లో ఇక ఇవి కనిపించవు?

     Written by : smtv Desk | Sun, Jun 28, 2020, 11:05 AM

ఐఫోన్ బాక్స్ లో ఇక ఇవి కనిపించవు?

ఐఫోన్ 12 ఈ సంవత్సరం చివరిలో రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సాధారణంగా ఐఫోన్ కొనేవారికి వైర్డ్ హెడ్ ఫోన్స్, అడాప్టర్ ను బాక్స్ తో పాటే అందిస్తారు. అయితే ఈసారి ఈ రెండూ బాక్స్ తో రాకపోవచ్చని తెలుస్తోంది. యాపిల్ ఎయిర్ పోడ్స్ సేల్స్ ను పెంచడం కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మింగ్-చి కువో అనే టెక్ విశ్లేషకుడు గతంలోనే తెలిపారు. ఎయిర్ పోడ్స్ 2, ఎయిర్ పోడ్స్ అమ్మకాలను పెంచడానికే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 బాక్స్ లో ఫోన్ కాకుండా కేవలం యూఎస్ బీ టైప్-సీ నుంచి లైటెనింగ్ కేబుల్ కన్వర్టర్ కేబుల్ ను మాత్రమే అందించనున్నట్లు యాపిల్ పంపిణీదారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు నిజమైతే ఇకపై మీరు పవర్ అడాప్టర్ ను కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. అమెరికాలో 5W యాపిల్ అడాప్టర్ ధర 19 డాలర్లుగానూ(సుమారు రూ.1,500), 18W అడాప్టర్ ధర 29 డాలర్లుగానూ(సుమారు రూ.2,100) ఉంది.

ప్రస్తుతం ఐఫోన్ 12 ఉత్పత్తి అనుకున్న దానికంటే నాలుగు నుంచి ఆరు వారాల వరకు వెనకబడి ఉంది. ఐఫోన్ 12 లాంచ్ సెప్టెంబర్ లోనే జరగనున్నప్పటికీ సేల్ మాత్రం అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... రెండు హైఎండ్ ఐఫోన్ 12 ప్రో మోడళ్లలో వెనకవైపు మూడు కెమెరాలను అందించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిలో లిడార్ స్కానర్ అనే ఫీచర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఏఆర్ అనుభవం మరింత అద్భుతంగా ఉండనుంది. ఎయిర్ పోడ్స్ తర్వాతి వెర్షన్ 2021 ప్రారంభంలో లాంచ్ కానున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements