విశాఖ బస్ స్టేషన్‌లో భారీగా నగదు పట్టివేత

     Written by : smtv Desk | Sun, Jun 28, 2020, 11:16 AM

విశాఖ బస్ స్టేషన్‌లో భారీగా నగదు పట్టివేత

విశాఖ నగరంలో రోజురోజుకు కరోనా కేసులతో పాటు... నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇటీవలే ఓ రౌడీ షీటర్ గ్యాంగ్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో భారీగా నగదు పట్టుబడింది. బ్యాగ్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అధికారులు దాడి చేసి నగదును పట్టుకున్నారు. బ్యాగులో 50 లక్షల 38 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబందించి తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణంకు సంబందించిన యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగల దుకాణం యజమానిని సైతం ఈ విషయంపై విచారించనున్నారు. ఇంత మెత్తంలో నగదు ఎక్కడిది ? ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాల్ని కూడా పోలీసులు విచారించనున్నారు.

మరోవైపు కృష్ణా జిల్లాలోని మైలవరం మండలం పొందుగల పంగిడి చెరువు వద్ద భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 729 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తులు ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన వారుగా గుర్తించారు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.





Untitled Document
Advertisements