24 గంటల్లో 19,906 కేసులు, 410 మరణాలు!

     Written by : smtv Desk | Sun, Jun 28, 2020, 11:41 AM

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఊహించని రీతిలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన గణాంకాలను చూస్తుంటే భారత్ లో కరోనా వైరస్ అదుపు తప్పింది అని తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 19,906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయినా ఈ పాజిటివ్ కేసులతో మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,28,859 కి చేరింది.


అంతేకాక అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 410 మంది మరణించారు. వీటి తో భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 16,095 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఇది కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. గడిచిన 24 గంటల్లో 13,832 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 3,09,713 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

భారత్ లో ప్రస్తుతం 2,03,051 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోవడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. అన్ లాక్ 1.0 కారణంగా ఈ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. భారత్ లో వాక్సిన్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements