ఇంగ్లాండ్ టూర్‌కి బయల్దేరిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:30 PM

ఇంగ్లాండ్ టూర్‌కి బయల్దేరిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు అక్కడికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు బయల్దేరి వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం జులై 30 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో నెల ముందే అక్కడికి పాకిస్థాన్ జట్టుని పంపాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సూచించింది. దాంతో.. 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయ సిబ్బంది ఈరోజు పాకిస్థాన్ నుంచి బయల్దేరి వెళ్లారు.వాస్తవానికి ఇంగ్లాండ్ పర్యటన కోసం 29 మందితో కూడిన జట్టుని ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. కానీ.. గత సోమవారం ఆటగాళ్లందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 29 మందిలో 10 మంది క్రికెటర్లకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. వారిని మినహాయించి మిగిలినవాళ్లందరినీ టూర్‌కి పంపింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? శనివారం ఆ 10 మంది ఆటగాళ్లకి రెండోసారి కరోనా టెస్టులు నిర్వహించగా..? ఆరుగురికి నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ.. వారిని జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కి పంపేందుకు పీసీబీ సాహసించలేదు.ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన షోయబ్ మాలిక్ జులైలో మూడో వారంలో అక్కడికి వెళ్లనున్నాడు. లాక్‌డౌన్ కారణంగా తన భార్య సానియా మీర్జా, కొడుకు ఇజ్జాన్‌కి ఐదు నెలలు దూరంగా ఉన్న మాలిక్.. వారితో కొన్ని రోజులు సమయం గడిపి తర్వాత టీమ్‌తో జాయిన్ అవతానని పీసీబీని కోరగా.. అందుకు బోర్డు నుంచి అనుమతి లభించింది. దాంతో.. జట్టులోకి ఎంపికైన 11 మంది ఆటగాళ్లు పాక్‌లోనే ఉండిపోగా.. మిగిలిన 18 మంది ఇంగ్లాండ్ టూర్‌కి బయల్దేరి వెళ్లారు.






Untitled Document
Advertisements