'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:43 PM

'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ నటిస్తోన్న 'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్‌లో పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్లు ఇందులో ఉంది. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వాదనలు వినిపిస్తుండగా పక్కనే నటి అంజ‌లి కూర్చొని ఉంది. కోర్టులో వాదనలు వినడానికి వచ్చిన మరి కొందరూ ఇందులో కనపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది.

కాగా, బాలీవుడ్ సినిమా 'పింక్‌'కు రీమేక్‌గా వకీల్ సాబ్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. అంజ‌లితో పాటు నివేదా థామ‌స్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తయింది.





Untitled Document
Advertisements