పోలీసును తన్నిన మాజీ ఎంపీ అర్జునన్... వీడియో వైరల్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:53 PM

పోలీసును తన్నిన మాజీ ఎంపీ అర్జునన్... వీడియో వైరల్

తమిళనాడులోని సాలెంలో ఉన్న పోలీసు అధికారిని మాజీ ఎంపీ, డీఎంకే నేత కే అర్జునన్ కాలితో తన్ని రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. కొవిడ్‌-19 వ్యాప్తి కట్టడిలో భాగంగా అక్కడి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులు.. అర్జునన్‌ వెళ్తున్న వాహనాన్ని ఆపి ఈ-పాస్ చూపించాలని అడిగారు.



దీంతో ఆ మాజీ ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. నన్నే ఆపుతావా? అంటూ పోలీసులతో గొడవకు దిగారు. పరుష పదజాలంతో దూషిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి అనంతరం కారులో కూర్చుకున్నారు. అనంతరం మళ్లీ కారు దిగి దూసుకొచ్చి, దాడి చేశారు. కొంత మంది వారి మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకున్నారు.





Untitled Document
Advertisements