బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచిన రియల్ మీ

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 03:27 PM

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచిన రియల్ మీ

రియల్ మీ తన స్మార్ట్ ఫోన్ల ధరలను మళ్లీ పెంచింది. ఈసారి రియల్ మీ 6, రియల్ మీ సీ2, రియల్ మీ 5ఎస్, రియల్ మీ 5ఐ స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగాయి. స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ పెంపు జరిగినప్పటి నుంచి ఈ ఫోన్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
రియల్ మీ 6 ధర
రియల్ మీ 6 స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.13,999గా ఉండేది. ఇప్పుడు రూ.1,000 పెరిగి రూ.14,999కు మారింది. మిగతా వేరియంట్లపై కూడా రూ.1,000 పెరిగింది. దీంతో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999కు, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999కు పెరిగింది.

రియల్ మీ 5ఐ ధర
రియల్ మీ 5ఐ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,000 పెరిగింది. దీంతో ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 నుంచి రూ.10,999కు పెరిగింది. అలాగే 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999కు పెరిగింది.

రియల్ మీ 5ఎస్ ధర
రియల్ మీ 5ఎస్ ధర కూడా రూ.1,000 పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 నుంచి రూ.11,999కు పెరిగింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 నుంచి రూ.12,999కు పెరిగింది.

రియల్ మీ సీ2 ధర
రియల్ సీ2 స్మార్ట్ ఫోన్ ధర రూ.500 పెరిగింది. ఇందులో 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999కు పెరిగింది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 నుంచి రూ.7,499కు పెరిగింది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 నుంచి రూ.7,999కు పెరిగింది.

గతవారం రియల్ మీ నార్జో 10ఏ, రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. రియల్ మీ నార్జో 10ఏ స్మార్ట్ ఫోన్ ధర రూ.500, రియల్ మీ సీ3 ధర రూ.1,000 పెరిగింది. దీంతో రియల్ మీ నార్జో 10ఏ, రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం కానున్నాయి.

Untitled Document
Advertisements