వర్మ 'పవర్ స్టార్' సినిమా...ఫీలైన సీనియర్ రచయిత!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 03:37 PM

వర్మ 'పవర్ స్టార్' సినిమా...ఫీలైన సీనియర్ రచయిత!

పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన రామ్ గోపాల్ వర్మ.. గత కొంతకాలంగా ట్రాక్ చేంజ్ చేసేశారు. తక్కువ బడ్జెట్ సినిమాలు, అడల్ట్ కిక్కిచ్చే మూవీలు రూపొందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ''క్లైమాక్స్, నగ్నం'' మూవీలు తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. పవర్ స్టార్ పేరుతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మరో సినిమా ప్రకటించడంతో అంతా షాకయ్యారు.

పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెప్పేశారు. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్జీవీ చేసిన ఈ ప్రకటన చూసి పవన్ ఫ్యాన్స్ కాసింత మండిపడ్డారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రకటనపై సీనియర్ రచయిత రామ్ జోగయ్య శాస్త్రి రియాక్ట్ కావడం మరింత సెన్సేషన్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ మూవీ ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో స్పందిస్తూ తాను హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని, ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధించేవాడినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ''మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో చేస్తున్నారు. పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇచ్చినా తెలివిగా ఏదో చెప్పేస్తారు...నేను హర్ట్ అయ్యా'' అని ట్వీట్ చేశారు రామజోగయ్య శాస్త్రి.

Untitled Document
Advertisements