ఢాకాలో నౌకలు ఢీకొని 30 మంది మృతి...

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:03 PM

ఢాకాలో నౌకలు ఢీకొని 30 మంది మృతి...

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నౌకలు పరస్పరం ఢీకొనడంతో ప్రయాణికులతో ఉన్న ఓ నౌక నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 23 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఫైర్ బ్రిగేడ్ అధికారి ఇనాయత్ హుస్సేన్ మీడియాకు తెలిపారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో సోమవారం (జూన్ 29) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements