షియోమీ నుంచి రేపు లాంచ్ కానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:39 PM

షియోమీ నుంచి రేపు లాంచ్ కానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

షియోమీ తన రెడ్ మీ 9ఏ, రెడ్ మీ 9సీ స్మార్ట్ ఫోన్లను రేపు(జూన్ 30వ తేదీ) లాంచ్ చేయనుంది. కంపెనీ మలేషియా పేజీలో దీన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో వీటి గురించిన స్పెసిఫికేషన్లను షియోమీ వెల్లడించలేదు. అయితే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్ లైన్ లో లీకయ్యాయి. దీనికి తోడు రెడ్ మీ 9ఏ ఫొటోలు కూడా ఆన్ లైన్ లో లీకయ్యాయి.
కంపెనీ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లలో తేదీని మాత్రమే తెలిపింది. గతేడాది లాంచ్ అయిన రెడ్ మీ 8ఏకు తర్వాతి వెర్షన్ గా రెడ్ మీ 9ఏ లాంచ్ కానుంది. రెడ్ మీ 9 సిరీస్ లో కొత్తగా లాంచ్ అవుతున్న ఫోన్ రెడ్ మీ 9సీ. దీనికి సంబంధించిన ఈవెంట్ జరగనుందా? లేక నేరుగా మార్కెట్లోకి రానున్నాయో కూడా షియోమీ తెలపలేదు.

ఇప్పటిదాకా లీకైన ఫొటోల ప్రకారం చూస్తే.. రెడ్ మీ 9ఏలో మూడు వేర్వేరు కలర్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మిడ్ నైట్ గ్రే, ట్విలైట్ బ్లూ, పీకాక్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ముందువైపు ఉన్న నాచ్ లో సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ఈ డిజైన్ రెడ్ మీ 9 తరహాలోనే ఉండనుంది. అయితే వెనకవైపు ప్యానెల్, కెమెరా ప్లేస్ మెంట్ మాత్రం కొత్తగా ఉంది. ఫోన్ వెనకాల.. ఎడమవైపు పైభాగంలో రెండు కెమెరాల సెటప్ ఉండనుంది.ఇక లీకైన స్పెసిఫికేషన్లను చూస్తే.. రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్లో 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ ను అందించే అవకాశం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది. రెడ్ మీ 9సీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

Untitled Document
Advertisements