పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత పీవీపీ

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:46 PM

పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత పీవీపీ

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఆయనపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. దీంతో, భయంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Untitled Document
Advertisements