పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ...మరో కేసు నమోదు!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:47 PM

పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ...మరో కేసు నమోదు!

ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్‌ వి.పొట్లూరి (పీవీపీ)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఓ కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

గతవారం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.

Untitled Document
Advertisements