చైనాపై ప్రతీకారం.... 'మేడిన్ చైనా' వస్తువులు దగ్ధం

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:55 PM

చైనాపై ప్రతీకారం.... 'మేడిన్ చైనా' వస్తువులు దగ్ధం

గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్ల ప్రాణాలను చైనా బలిగొన్న నేపథ్యంలో... డ్రాగన్ కంట్రీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆగ్రా వాసులు చైనా తీరును నిరసిస్తూ... మేడిన్ చైనా వస్తువులను దహనం చేస్తున్నారు. చైనా వస్తువులను బహిష్కరించి, ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తామని అంటున్నారు. నగరంలోని కూడళ్లలో చైనా వస్తువులను వేసి దగ్ధం చేస్తున్నారు.

చైనాలో తయారైన ఫోన్లు, టీవీలను సైతం తగలబెట్టారు. చైనా వస్తువులను తగలబెట్టడం ద్వారా అమర వీరులకు నివాళి అర్పిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. భారతీయులెవరూ చైనా వస్తువులను ఉపయోగించొద్దని పిలుపునిచ్చారు. దీపావళి నాటికి చైనా వస్తువులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆగ్రా మేయర్ కోరారు.

Untitled Document
Advertisements