రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 06:12 PM

రామ్ గోపాల్ వర్మ సంచలన  వ్యాఖ్యలు

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులను నెటిజెన్లు విమర్శిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. బాలీవుడ్ టాప్ 10 స్టార్స్ లో సుశాంత్ ఒక్కడని... ఆయన మార్కెట్ వాల్యూ రూ. 75 కోట్లని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎవరు అణచివేస్తారని ప్రశ్నించారు.

బాలీవుడ్ లో ప్రతి యేటా దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయని... వాటిలో 10 సినిమాలను నియంత్రించడం దర్శకనిర్మాత కరణ్ జొహార్ వల్ల కాదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Untitled Document
Advertisements