ముద్దులు, హగ్ లు నా వల్ల కాదు: రెజీన

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 08:03 PM

ముద్దులు, హగ్ లు నా వల్ల కాదు: రెజీన

దక్షిణ భారత సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణుల్లో రెజీనా కాసాండ్ర ఒకరు. అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి ఆమె. ‘ఎస్ఎంఎస్ - శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి తాను ఏమీ సిగ్గుపడనని గతంలో రెజీనా చాలా సార్లు చెప్పారు. కొంత మంది హీరోలకు లిప్ లాక్‌లు కూడా పెట్టారు. ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి తాను ఇలాంటి సీన్స్‌లో నటించడానికి వెనకడుగు వేయనని రెజీనా చెబుతుంటారు. కానీ. ఇప్పుడు తన నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నారు. రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు.
ఇటీవల మీడియాతో ముచ్చటించిన రెజీనా తన రాబోయే చిత్రాల్లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేయడానికి తనకు భయమేస్తోందని రెజీనా చెప్పారు. తన రాబోయే చిత్రాల్లో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ముద్దు సన్నివేశాల్లో నటించడం తనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందని చెప్పారు. కానీ, కథకు అవసరం అనుకుంటే మన ఇబ్బందులు పక్కనబెట్టి ఇలాంటి సన్నివేశాలు చేయక తప్పదన్నారు.
కాగా, విశాల్ ‘చక్ర’ సినిమాలో రెజీనా ఒక కీలక పాత్ర పోషించారు. ఆమెది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఇప్పటికే ఆమె ‘ఎవరు’ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి తనలోని వైవిధ్యమైన నటనను రెజీనా బయటపెట్టబోతున్నారని టాక్. తాజాగా విడుదలైన ‘చక్ర’ టీజర్‌లో రెజీనా పాత్రను రివీల్ చేయలేదు. ఈ పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంటున్నారు.

Untitled Document
Advertisements