వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన సీఎం జగన్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 08:04 PM

వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన సీఎం జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని.. ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
దివంగత వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ బాటలో సీఎం జగన్ సైతం రైతు సంక్షేమం అనేక చర్యలు చేపడుతున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు, రైతు బీమా, ఉచిత బోర్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.


Untitled Document
Advertisements