ఎన్టీఆర్‌ గతం గురించి తెలిసి బాధపడ్డాను: సినీ నటి

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 11:14 AM

ఎన్టీఆర్‌ గతం గురించి తెలిసి బాధపడ్డాను: సినీ నటి

చిత్ర పరిశ్రమలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి గురించి మాట్లాడిన తనకు బెదిరింపులు వస్తున్నాయని నటి పాయల్ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారని, అయితే, అతడికి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయం ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పాయల్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బెదిరింపుల కారణంగా తాను డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించినట్టు పాయల్ పేర్కొన్నారు.

తారక్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారంటూ తనకు మెసేజ్‌లు వస్తున్నాయని, అయితే, సినిమా కోసం ఆయన పడే కష్టం మరెవరికీ తెలియదని అన్నారు. ఆయన పట్ల కాస్త జాలి చూపించాలని కోరారు. తారక్ గతం గురించి తెలిసిన తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొన్నారు. ఇక బెదిరింపులు ఆపేయాలని, ఎన్టీఆర్‌ను చూసి గర్వపడాలని పాయల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తనను సోషల్ మీడియా వేదికగా దూషించడం ఆపాలని కోరారు.





Untitled Document
Advertisements