ప్రెగ్నెంట్‌ టైంలో స్వీట్స్ తింటే పిల్లలకు గుండె సమస్యలు..!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 04:01 PM

ప్రెగ్నెంట్‌ టైంలో స్వీట్స్ తింటే పిల్లలకు గుండె సమస్యలు..!

గర్భవతులు పంచదార తక్కువగా తీసుకోవాలి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్ తెగ తినేసేదాన్ని అని ఒకరంటే.. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేవి అని ఇంకొకరు అంటారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తినాలపించడం సహజమేనని, గర్భవతులకి వాళ్ళు ఏం తినాలని కోరుకుంటే అవి చేసి పెట్టాలని చెబుతారు.

​1. షుగర్ ఎక్కువ తింటే..:

ప్రెగ్నెంట్ సమయంలో తినే ఆహారం తల్లినీ, బిడ్డనీ కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు వీలైనంత తగ్గించమని వారు సలహా ఇస్తున్నారు. షుగర్ ఎక్కువ తీసుకోవడం మామూలుగానే మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే బిడ్డ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. గర్భవతులు పంచదార తగ్గించి తినమని నిపుణులు ఎందుకు సలహా ఇస్తున్నారో తెలుసుకోండి.

​2. అధిక బరువుతో పిల్లలు..:

షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి రావచ్చు. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు, పుట్టాక బరువు పెరగొచ్చు. ఓ స్టడీ ప్రకారం ఏడెనిమిదేళ్ళకి ఈ పిల్లలు బాగా ఎక్కువ బరువుతో ఉంటారని తెలుస్తోంది. అంటే స్కూల్ కి వెళ్ళే సమయం లో పిల్లలు బరువు ఎక్కువగా ఉంటే వాళ్ళు చదువులోనూ, ఆట పాటల్లోనూ కూడా చురుగ్గా ఉండరు. పిల్లలకే కాక తల్లికి కూడా ఇది సమస్యనే. షుగర్ ఎక్కువ ఉన్న పదార్ధాలు తీసుకోవడం వాళ్ళు ఎక్కువ బరువు పెరుగుతారు. మామూలు ప్రెగ్నెన్సీ వెయిట్ కన్నా ఇలా పెరిగిన వెయిట్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది.

​3.గుండె సమస్యలు:

తల్లులు ప్రెగ్నెంట్ టైమ్‌లో స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మెటబాలిక్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. అందుకని, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. పంచదార కలపకుండా పండ్ల రసం తీసుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పదార్ధాలు కూడా తినవచ్చు. మామూలుగా షుగర్ అంటే స్వీట్స్ అనే అనుకుంటాం. కానీ, కాఫీ, టీలో కలిపే పంచదార, జ్యూస్ లో కలిపే పంచదారని మర్చిపోతాం. అదే కాక మార్కెట్ లో కొనుక్కొచ్చిన బ్రెడ్, జామ్, కుకీస్, చల్లగా ఉంటుందని తాగే కూల్ డ్రింక్స్...వీటన్నింటి లోనూ షుగర్ ఉంటుంది. కాబట్టి మీరు మరీ ఐస్ క్రీమ్, చాక్లెట్టో తినాలనిపిస్తే తినండి, కానీ, కొంచెం తినండి.

​4. తక్కువ తెలివితేటలు..:

ఓ స్టడీ ప్రకారం తల్లి షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే అది పిల్లల తెలివితేటల మీద ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. చెప్పింది త్వరగా అర్ధం చేసుకోవడంలోనూ, అర్ధమైనది వెంటనే ఆచరణలో పెట్టడంలోనూ, గుర్తుపెట్టుకోవడంలోనూ, ఈ పిల్లలు ఇబ్బంది పడతారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పదాలు గుర్తుపెట్టుకోడంలో, ఎక్కాలూ, లెక్కలూ నేర్చుకోడంలో వీరు కొంత వెనకపడతారని తెలుస్తోంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తల్లి పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు ఎక్కువగా తింటే ఆ పిల్లల చదువుసంధ్యలు కొద్దిగా దెబ్బ తింటాయన్న మాట.

​5. ఎలర్జీలు వచ్చే అవకాశం:

తల్లి ఎక్కువ పంచదార తింటే పిల్లలు ఎలర్జీల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నారు. ఈ ఎలర్జీలు డస్ట్ ఎలర్జీ నుంచి, చర్మం మీద రాషెస్ వరకూ, జలుబు/దగ్గు నుంచి, ఆస్థ్మా వరకూ ఏవైనా కావచ్చు. పైగా ఈ ఎలర్జీలు కూడా పిల్లలు ఏడెనిమిదేళ్ళు వయసులో ఉన్నప్పుడే బయటపడతాయి. అంతే కాక ఎలర్జీలంటే అవి జీవితాంతం ఉంటాయి. అవి రాకుండా చూసుకోగలం, వచ్చాక మందు వేసుకోగలం, కానీ పూర్తిగా అవి రాకుండా చేయలేం కాబట్టి అసలు పిల్లలు ఈ సమస్యల బారిన పడకుండా ముందే జాగ్రత్త పడడం మంచిది.





Untitled Document
Advertisements