2007 టీ20 ప్రపంచకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన లాల్‌చంద్

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 07:11 PM

2007 టీ20 ప్రపంచకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన లాల్‌చంద్

దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఫస్ట్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడలేనందుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అప్పట్లో చాలా బాధపడ్డాడని భారత జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. ఆ వరల్డ్‌కప్‌లో యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలని సచిన్, సౌరవ్ గంగూలీకి సూచించిన రాహుల్ ద్రవిడ్.. తాను కూడా ఆ టోర్నీకి దూరంగా ఉండిపోయాడు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్‌లో పాకిస్థాన్‌ని ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్.. భారత్‌కి ప్రపంచకప్‌ అందించాలనే చిరకాల వాంఛతో అప్పట్లో ఉన్నాడు. కానీ.. ద్రవిడ్ సూచనతో 2007 టీ20 ప్రపంచకప్‌కి అతను దూరంగా ఉండగా.. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దాంతో.. ఆ జట్టులో తను లేనందుకు సచిన్ చాలా బాధపడ్డాడని లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. సచిన్ ఒక్కడే కాదు.. గంగూలీ, ద్రవిడ్ కూడా చింతించి ఉంటారని అతను చెప్పుకొచ్చాడు.

‘‘సచిన్ అప్పట్లో నాతో తరచూ ఓ మాట అనేవాడు. చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను.. కానీ.. ఒకసారి కూడా ప్రపంచకప్‌ గెలవలేదు అని. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడలేందుకు సచిన్‌తో పాటు ద్రవిడ్, గంగూలీ కూడా విచారం వ్యక్తం చేశారు. వాస్తవానికి సచిన్, గంగూలీని ఆ టోర్నీలో ఆడొద్దని సూచించింది రాహుల్ ద్రవిడ్. యువ క్రికెటర్లకి అవకాశమివ్వడం కోసం ఆ టోర్నీకి దూరంగా ఉండాలని ఆ దిగ్గజాలు నిర్ణయించుకున్నారు’’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌‌ని భారత్ గెలవగా.. సచిన్‌ని సహచరులందరూ భుజాలపై ఎత్తుకుని మైదానంలో ఊరేగించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements