హే కృష్ణా......నీ పైన ఈ లీలా.....!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 09:37 PM

హే కృష్ణా......నీ పైన ఈ లీలా.....!

హే కృష్ణా......నీ పైన ఈ లీలా.....
కృష్ణా...ఈ పేరు వినగానే చీరలు దాచిన వాడు, మగువల మనస్సులు దోచిన వాడు, మాయలు చేసిన వాడు అనే చాలామందికి గుర్తొస్తుంది. ఒకరి కంటే ఎక్కువమంది ఆడవారితో సాన్నిహిత్యంగా ఉన్న ప్రతి మగవాడిని ఆ కృష్ణుని తో పోల్చడం అనేది ద్వాపరయుగం నాటి నుంచి నేటి నెటిజన్ల వరకు పరిపాటిగా మారింది.
ఆ నేపథ్యంతోనే దర్శకుడు రవికాంత్ "కృష్ణ హిజ్ లీల" అనే పేరుతో ఒక కథాంశం తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ వారు దీన్ని ప్రొడ్యూస్ చేశారు.ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ చిత్ర కథానాయకుడు కృష్ణుని పాత్ర పోషించగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే శాలిని, శ్రద్ధా శ్రీనాథ్ లు... రాధా, సత్యభామలుగా కథానాయికల పాత్రలతో మెరిశారు.నెట్ ఫ్లెక్సీ ద్వారా నెటిజన్లు ముందుకొచ్చింది ఈ చిత్రం.
కథాంశం నేటి సమాజ స్థితికి అద్దం పట్టేలా యువతను ఆకర్షించేలా ఉన్నప్పటికీ కథలో పాత్రల పేర్లు వారి ప్రవర్తనా శైలి తమ సాంప్రదాయాన్ని తమ దైవాన్ని అవమానపరిచే విధంగా తమ నమ్మకాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నాయన్నది హిందు ధర్మ రక్షకుల వాదన.
కృష్ణుడంటే కేవలం గోపికా లోలుడే కాదని గీతాచార్యుడని ఆయన లీలలు అర్థం చేసుకోవడానికి గొప్ప జ్ఞానం ఉండాలని మిడిమిడి జ్ఞానంతో తీసే ఇలాంటి చిత్రాలకు హిందూ దేవతల పేర్లు వాడడం అనేది హిందూ ధర్మానికి, సాంప్రదాయానికి, హిందూ తత్వానికి గొడ్డలిపెట్టు అని వాటిని ప్రోత్సహించడం హిందూ ధర్మ వ్యతిరేకమే అని సాంప్రదాయ వాదులు తమ నిరసనని ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి సినిమాని ప్రమోట్ చేసిన నెట్ ఫ్లెక్సీపై కూడా వ్యతిరేక విమర్శల వెల్లువెత్తడం విశేషం. దర్శకుడు సినిమా మరియు పాత్రల పేర్లు విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదేమో.ఏదేమైనా కృష్ణుని భగవంతునిగా ఆరాధించే వారికి ఈ చిత్రం తీవ్రమైన మనస్థాపానికి కలిగించింది అనడంలో సందేహం లేదు. నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ వ్యతిరేకతకి ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిన విషయం.
ఇన్ని హర్ష వ్యతిరేకతల మధ్య ఈ చిత్రం ఎంతవరకు విజయం సాధిస్తుందో...... కృష్ణ నీ లీలలు ఎవరికి ఎరుక.





Untitled Document
Advertisements