మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ 21st సెంచరీ...జడేజా

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:46 PM

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ 21st సెంచరీ...జడేజా

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్‌లో.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అత్యద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజాని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా విజ్డెన్ ఇండియా ప్రకటించింది. క్రిక్‌విజ్ టూల్ సపోర్ట్‌తో జడేజా ప్రదర్శనని విశ్లేషించిన విజ్డెన్ ఇండియా.. అతనికి ఏకంగా 97.3 రేటింగ్ వచ్చినట్లు ప్రకటించింది. జడేజా కంటే శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్ మురళీధరన్ మాత్రమే ఈ రేటింగ్‌లో ముందున్నాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా... మూడేళ్ల వరకూ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ.. 2012లో ఇంగ్లాండ్‌పై ఫస్ట్ టెస్టులో ఆడిన జడేజాకి.. ఆ తర్వాత తిరుగు చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. స్పిన్ ఆల్‌రౌండర్‌ ఎదిగిన జడేజా.. మిడిలార్డర్‌లో నమ్మదిగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా.. టెయిలెండర్లతో కలిసి ఎన్నోసార్లు భారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించిన జడేజా.. ఇప్పటి వరకూ 49 టెస్టులాడి 35.26 సగటుతో 1,869 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండన్ షేన్‌ వాట్సన్ టెస్టు సగటు 35.2 కంటే ఇది ఎక్కువ. ఇదే విషయాన్ని విజ్డెన్ ఇండియా కూడా వెల్లడించింది.

టెస్టుల్లో 2.44 ఎకానమీతో బౌలింగ్ చేసిన జడేజా.. ఇప్పటి వరకూ 213 వికెట్లు పడగొట్టగా.. అతని బౌలింగ్ సగటు 24.63గా ఉంది. ఇది ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ (35.26) కంటే మెరుగు. టెస్టుల్లో ఒకసారి 10 వికెట్ల ఘనతని సాధించిన జడేజా.. తొమ్మిదిసార్లు 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ అతని ఖాతాలో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.





Untitled Document
Advertisements