మినరల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలో తెలుసా?

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:58 PM

మినరల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలో తెలుసా?

మినరల్ వాటర్.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ టిన్స్, వాటర్ బాటిల్స్ వాడుతూ మినరల్ వాటర్‌నే ఎక్కువగా తాగుతుంటారు. ప్రయాణాల్లో మాత్రమే కాకుండా.. ఇంటికి కూడా ఆ వాటర్‌ని తెప్పించుకుంటున్నారు. ఇంతకు ముందు అయితే ఊరంతటికీ ఓ వాటర్ ట్యాంక్ ఉండేది. లేదా బావుల్లో ఉండే నీటిని తోడుకుని వాడేవారు. కానీ, ఇప్పుడు సిటీల్లో ఆ పరిస్థితులు లేవు. అందుకే ట్యాప్స్ వచ్చాయి. పంపులు వస్తే ఆ నీటిని తాగేవారం.. కానీ, రాను రాను ఈ కల్చర్ తగ్గి కొత్తగా మినరల్ వాటర్‌కి జనాలు అలవాటు పడ్డారు. ఒకరినీ చూసి ఒకరు క్యాన్స్ తెప్పించుకోవడం వంటివి చేస్తున్నారు.
అయితే, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ వాటర్‌లో మినరల్స్ ఉండవు సరికదా.. వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
వీటితో పాటు మినరల్ వాటర్ తాగితే వచ్చే సమస్యల్లో ఒకటే మోకాలి నొప్పులు. నీటిని తాగడం వల్ల తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయట. మరీ ముఖ్యంగా.. ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్‌లో ఉండవు.Also Read : డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే..
మామూలు ఏ మంచినీరైనా సరే దానిని కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో పోసి ఆ నీరు తాగితే మంచిదని చెబుతున్నారు.. ఇక కుండనీరు తాగితతే.. బెనిఫిట్స్ ఏంటంటే.. ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు.. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకల్లో బలహీనంగా మారుతాయని చెబుతున్నారు.అదే విధంగా.. చాలా మంది నీరు ఎక్కువగా తాగరు.. దీని వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలోని అన్నీ జీవిక్రియలకు నీరే ఆధారం.

అందుకే నీరు ఎంత తాగితే అంత మంచిది. అప్పుడే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు దూరం అవుతాయి. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఒక్క ఆరోగ్య పరంగానే కాదు.. అందానికి కూడా నీరు ముఖ్యం అని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తూ తాజాగా ఉంటుంది. ఇక జుట్టు రాలే సమస్యలు వంటివి కూడా ఉండవు.. కాబట్టి కచ్చితంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి.. అదికూడా.. మినరల్ వాటర్‌ బదులు మామూలు బెటరేనని చెబుతున్నారు నిపుణులు.





Untitled Document
Advertisements