తల్లీకూతుళ్ల ముందు నీచానికి పాల్పడ్డ పోలీసు అధికారి...వీడియో

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 01:53 PM

తల్లీకూతుళ్ల ముందు నీచానికి పాల్పడ్డ పోలీసు అధికారి...వీడియో

బాధితులకు అండగా ఉండాల్సిన ఓ పోలీస్ అధికారి కామకీచకుడిగా మారాడు. స్టేషన్‌లోనే అత్యంత నీచానికి పాల్పడ్డాడు. స్టేషన్‌కి వచ్చిన మహిళలను చూసి కామంతో రెచ్చిపోయాడు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా తల్లీకూతుళ్ల ముందు దారుణానికి తెగబడ్డాడు. తన ప్యాంట్ ఊడదీసి జననాంగాలను బయటకు తీసి హస్తప్రయోగం చేశాడు. షాక్‌కి గురైన బాధితులు సదరు పోలీసు అధికారి కీచకపర్వాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ అత్యంత దారుణ ఘటన యూపీలో వెలుగుచూసింది.
డియోరియా జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు ఓ స్థల వివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తల్లీకూతుళ్లను చూసిన పోలీస్ అధికారి కామంతో రగిలిపోయాడు. వారితో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. తల్లీకూతుళ్ల ముందే స్టేషన్‌లోనే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన ప్యాంట్ జిప్ తీసేసి జననాంగాలను బయటకు తీసి హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ తల్లీకూతుళ్లను చూస్తూ అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఊహించని ఘటనతో బాధితులు షాక్‌కి గురయ్యారు.
బాధితురాలి కూతురు తెగించి రహస్యంగా ఆ తతంగాన్నంతా వీడియోలో చిత్రీకరించింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో కామాంధుడి బాగోతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిందితుడిని పోలీస్ ఇన్‌స్పెక్టర్ భీష్మ్‌పాల్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. వెంటనే సదరు కామకీచకుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డియోరియ జిల్లా ఎస్పీ శ్రీపతి మిశ్రా తెలిపారు.








Untitled Document
Advertisements