భారత్‌లో 4.6 కోట్ల మంది అమ్మాయిలు అదృశ్యం...వారు ఏమయ్యారు?

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 05:17 PM

భారత్‌లో 4.6 కోట్ల మంది అమ్మాయిలు అదృశ్యం...వారు ఏమయ్యారు?

గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో చైనా, భారత్‌లోనే సింహభాగం ఉన్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. గ ఐదు దశాబ్దాల్లో భారత్‌లో ఏకంగా 4.58 కోట్ల మంది మహిళలు ఏమయ్యారో తెలియలేదని మంగళవారం విడుదల చేసిన ఐరాసకు చెందిన పాపులేషన్ ఫండ్ నివేదిక వ్యాఖ్యానించింది.
1970 నుంచి గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా142.6 మంది అదృశ్యమైనట్టు యూఎన్‌పీఎఫ్ఏ ప్రపంచ జనాభా నివేదిక 2020 పేర్కొంది. ఈ ఐదు దశాబ్దాల్లో భారత్‌లో 45.8 మిలియన్ల మంది, చైనాలో 72.3 మిలియన్ల మంది మహిళలు కనిపించకుండా పోయినట్టు తెలిపింది. ‘ప్రసవానంతర, లింగవివక్షత కారణంగా తప్పిపోయిన మహిళలు, బాలికలు’అని ఏజెన్సీ వివరించింది.

2013 నుంచి 2017 మధ్య ఏడాదికి సగటున 460,000 మంది బాలికలు పుట్టిన తర్వాత కనిపించకుండా పోతున్నారు.. ఒక విశ్లేషణ ప్రకారం.. లింగ-వివక్షత కారణంగా మొత్తం తప్పిపోయిన బాలికలలో మూడింట రెండొంతుల మంది, జననానంతర మరణాలు మూడింట ఒక వంతు వరకు ఉన్నాయి.

యూఎన్‌పీఎఫ్ఏ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏడాడికి 1.2 మిలియన్ల నుంచి 1.5 మిలియన్ల మంది అదృశ్యమవుతుండగా లింగ వివక్షత వల్ల చైనా, భారత్‌లోనే ఇవి 90 నుంచి 95 శాతం ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లోనే ఏటా అత్యధిక సంఖ్యలో జననాలు నమోదవుతున్నాయి.

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయంగా నవజాత శిశువులు, బాలలు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల లింగ నిష్పత్తి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో ఆడపిల్లల మరణాలు రేటు అత్యధికంగా ఉంది. ప్రతి 1000 జననాల్లో 13.5 శాతం మంది ఉండగా, ఇది 5 ఏళ్లలోపు బాలికల మరణాలలో తొమ్మిది మరణాలలో ఒకటి ప్రసవానంతర లింగ వివక్షతకు కారణమని నివేదిక వెల్లడిస్తోంది.



పరిస్థితి ఇలాగే కొనసాగితే 2055 నాటికి అవివాహితుల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని, 50 ఏళ్ల వచ్చినా వివాహం కాని పురుషుల నిష్పత్తి 2050 తరువాత 10 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది బాలికలు వారి కుటుంబాలు, స్నేహితులు, బంధువుల వల్ల శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురువుతున్నారని నివేదిక పేర్కొంది.

లింగ వివక్షతను పరిష్కరించడానికి పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో భారత్, వియత్నాం చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారాలను యూఎన్‌పీఎఫ్ ప్రస్తావించింది. బాలికల ప్రాముఖ్యత గురించి, మహిళలు సమాజాన్ని ఎలా మార్చుతున్నారో.. వారి సాధించిన విజయాలు, కుటుంబాలు అభివృద్ధి చెందుతున్న విధానం వివరిస్తున్నారని తెలిపింది.





Untitled Document
Advertisements