తొలిఏకాదశి ప్రత్యేకత...విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 06:17 PM

తొలిఏకాదశి ప్రత్యేకత...విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు!

తొలిఏకాదశి....అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.అంటే హిందూ ధర్మం ప్రకారం శ్రీ మహా విష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలపాటు యోగనిద్రలో ఉండి మార్గశిర ఏకాదశి నాడు నిద్రలేస్తారు.ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస వ్రతం అని కూడా అంటారు.
ఏకాదశి అంటేనే విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజని అందునా ఆషాఢ ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనదని విష్ణు భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి నాడు ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది.జొన్నలను వేపి పేలాలు గా చేసి బెల్లంతో కలిపి ఓ ప్రత్యేకమైన ప్రసాదాన్ని తయారు చేసి దానిని విష్ణువుకి సమర్పిస్తారు. శాస్త్ర పరంగా అయితే బెల్లంతో కలిపిన ఈ పేలాల పిండి మనిషి శరీరంలో జీర్ణవ్యవస్థపై బాగా పనిచేస్తుంది.
ఇలా ఆరోగ్య పరంగాను ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ తొలి ఏకాదశి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.విష్ణు భక్తులతోపాటు ప్రజలందరికీ కూడా ఆ విష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని నేటి సమాజంలో ఉన్న విపత్కర పరిస్థితులు పోవాలని ఆ విష్ణుని ప్రార్థిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.





Untitled Document
Advertisements