SBI ఏటీఎం విత్‌డ్రా నిబంధనల సవరణ...కస్టమర్లపై ఎఫెక్ట్!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 02:47 PM

SBI ఏటీఎం విత్‌డ్రా నిబంధనల సవరణ...కస్టమర్లపై ఎఫెక్ట్!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను సవరించింది. దీంతో కస్టమర్లపై నేరుగానే ప్రభావం పడనుంది. అందువల్ల కొత్త ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ గురించి తెలుసుకుందాం.

ఎస్‌బీఐ ఇటీవల ఏటీఎం చార్జీలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉచిత లావాదేవీలు దాటినా కూడా చార్జీలు పడవని పేర్కొంది. అయితే ఇది జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు మళ్లీ ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఏటీఎం రూల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం.యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.25,000 వరకు కలిగిన కస్టమర్లు 8 ఏటీఎం లావాదేవీలను ఉచితంగా పొందొచ్చు. ఇందులో 5 ట్రాన్సాక్షన్లను ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో వినియోగించుకోవచ్చు. ఇతర మిగతా మూడు లావాదేవీలను ఇతర బ్యాంకుల్లో నిర్వహించొచ్చు. హైదరబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో ఇది వర్తిస్తుంది. నాన్ మోట్రో ప్రాంతాల్లో 10 ఉచిత ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. ఐదు ఎస్‌బీఐ ఏటీఎంలో, ఐదు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో లావాదేవీలు జరపొచ్చు.
అదే రూ.50,000 వరకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కలిగిన కస్టమర్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 8 ఉచిత ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. 3 మెట్రో ప్రాంతాల్లో 5 నాన్ మెట్రో ప్రాంతాల్లో లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. రూ.25 వేలకు పైన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఏటీఎంలలో ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినా నిర్వహించొచ్చు. రూ.లక్షకు పైగా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కలిగి ఉంటే ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా ఎన్నిసార్లైనా ట్రాన్సాక్షన్లు జరపొచ్చు.

ఒకవేళ ఉచిత లిమిట్ దాటితే అప్పుడు ఎస్‌బీఐ రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీలు వసూలు చేస్తోంది. దీనికి జీఎస్‌టీ కూడా అదనం. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు అయితే బ్యాంక్ ఉచిత లిమిట్ దాటిన తర్వాత రూ.5 నుంచి రూ.8 వరకు చార్జీలు తీసుకుంటోంది. దీనికి కూడా జీఎస్టీ అదనం. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తే.. అప్పుడు రూ.20 చార్జీ పడుతుంది. ఎస్‌బీఐ వద్ద శాలరీ అకౌంట్ కలిగి ఉంటే అన్‌లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సాక్షన్లు చేయొచ్చు.





Untitled Document
Advertisements