లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 05:07 PM

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌!

కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ బయటకు బయటకు వచ్చినప్పుడు అంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ నిబంధన కచ్చితమని, ఒకవేళ ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కేసులు, జరిమానాలు నమోదు చేస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణలో మాస్కులు ధరించని 67,557 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేశారు.
మార్చి 22 నుంచి జూన్ 30 వరకు ఈ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మాస్కులు లేకుండా మరోమారు పట్టుబడితే జైలుకు పంపాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో జంటనగర వాసులు ముందున్నారు. మార్చి 22 నాటి నుంచి ఈ చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే.

14,346 కేసులతో హైదరాబాద్‌లో ఉల్లంఘనలు ఎక్కువగా జరగ్గా, రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290, ఖమ్మంలో 6,372, సూర్యాపేటలో 4,213, వరంగల్‌లో 3,907 మందిపై మాస్కు ధరించనందుకు కేసులు పెట్టారు. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

తెలంగాణ పరిధిలో మాస్కు నిబంధన ఉల్లంఘిస్తే పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు పెట్టుకోనివారికి 3,288 మందికి చలానాలు విధించారు. మాస్కులు లేనివారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇలాంటి వారికి జారీ చేసిన చలనాల్లో వనపర్తి జిల్లా 846 కేసులతో తొలి స్థానంలో ఉండగా... 585 కేసులతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ రెండో స్థానంలో ఉంది.





Untitled Document
Advertisements