దిగొచ్చిన బంగార ధర..వెండి ఢమాల్

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 10:58 AM

దిగొచ్చిన బంగార ధర..వెండి ఢమాల్

పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వెలవెలబోయింది. పసిడి ఒక్క రోజులోనే భారీగా పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,330కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.50,940కు క్షీణించింది.పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,450 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,600కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1785 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం తగ్గుదలతో 18.23 డాలర్లకు క్షీణించింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,150కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.400 తగ్గుదలతో రూ.48,350కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.1450 తగ్గింది. రూ.48,600కు దిగొచ్చింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements