2011 వరల్డ్‌కప్ ఫిక్సింగ్: సంగక్కరను 10 గంటల పాటు విచారిన

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 02:54 PM

2011 వరల్డ్‌కప్ ఫిక్సింగ్: సంగక్కరను 10 గంటల పాటు విచారిన

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ముంబయిలోని వాంఖడే వేదికగా ఆ మ్యాచ్ జరగగా.. ‘ఆ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అమ్ముడుపోయింది’ అని ఇటీవల ఆ దేశ మాజీ క్రీడల మంత్రి మహిందానంద తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాడు. దాంతో.. అతని వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం.. ఆ ఫైనల్‌పై పూర్తి స్థాయిలో విచారణ కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఫస్ట్ మహిందానందని విచారించిన స్పెషల్ టీమ్.. అతని స్టేట్‌మెంట్‌ని రికార్డు చేయగా.. తన వద్ద ఫిక్సింగ్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని.. తాను కేవలం అనుమానంతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత 2011 వరల్డ్‌కప్‌కి టీమ్‌ని ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాని.. ఆ మ్యాచ్‌లో ఆడిన ఓపెనర్ ఉపుల్ తరంగాలని కూడా విచారించిన టీమ్.. తాజాగా అప్పటి శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర‌‌ని పిలిచి అతని స్టేట్‌మెంట్‌ని కూడా రికార్డు చేసింది. పదేళ్ల తర్వాత ఆ వరల్డ్‌కప్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం.. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించకపోయినా విచారణ పేరుతో క్రికెటర్లని వేధించడంపై ఆ దేశంలో నిరసనలు మొదలయ్యాయి. సంగక్కరని దాదాపు 10 గంటల పాటు విచారించిన ఇన్వెస్టిగేషన్ టీమ్.. రెండు సార్లు టాస్ వేయడంపైనా ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి అని చెప్పి వెళ్లిపోయాడు.






Untitled Document
Advertisements