లడఖ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మొదీ

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 03:03 PM

లడఖ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మొదీ

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ.. లేహ్, లడఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత ఉదయం 10.30 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ సైనికులతో సమావేశమయ్యారు. అనంతరం లడఖ్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడ శాంతిభద్రతలు లోపించినా భారత్ అక్కడ సేవలు అందజేస్తోందని అన్నారు. విస్తరణ వాదయుగం ముగిసిందని.. ఇప్పుడు వికాసయుగం మొదలయ్యిందన్నారు.

వేలాది సంవత్సరాలుగా ఎన్నో దాడులు ఎదుర్కొని, సమర్ధంగా తిప్పికొట్టామని అన్నారు. ఈ భూమి వీరభూమి.. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని, బలహీనులు శాంతిని సాధించలేదు.. శాంతి సాధించాలంటే ధైర్యసహసాలు అవసరమని ఉద్ఘాటించారు. భారత్ శక్తిసామర్ధ్యాలు అజేయమని అన్నారు. 14 కార్ప్స్ సైనికుల శౌర్య పరాక్రమాల గురించి దేశమంతా మాట్లాడుకుంటోందని అన్నారు.

విచ్చిన్న శక్తుల కుట్రలను లడఖ్ ప్రజలు తిప్పికొట్టారని, దేశ ప్రజలందని అశీస్సులు మీ అందరికీ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక.. మీ సాహస గాధలు దేశంలోని ప్రతి ఇంటికి చేరాయని కొనియాడారు. అమరులైన వీర సైనికులను మరోసారి ప్రధాని నివాళులర్పించారు. భారతమాత శత్రువులకు మీ పరాక్రమ జ్యాల ఏంటో చూపించారని ప్రశంసించారు.

విస్తరణవాదం యొక్క యుగం ముగిసిందని, ఇది అభివృద్ధికి సమయమని చైనాను పరోక్షంగా ప్రధాని హెచ్చరించారు. భారత్ శక్తి సామర్థ్యాలు అపారమని, నేవీ, ఆర్మీ, వాయు, పదాతిదళంలో మరింత శక్తివంతమయ్యామని అన్నారు. అనేక క్లిష్ట, సంక్షోభ సమయంలో ప్రపంచం వెంట భారత్ నిలిచిందని గుర్తుచేశారు.





Untitled Document
Advertisements