కేంద్రం నుంచి పెన్షన్ స్కీమ్....ఏడాదికి రూ.600తో చేతికి రూ.36,000!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 03:06 PM

కేంద్రం నుంచి పెన్షన్ స్కీమ్....ఏడాదికి రూ.600తో చేతికి రూ.36,000!

మోదీ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అన్నదాతను ఆదుకోవడానికి ప్రత్యేకమైన స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో పెన్షన్ పథకం కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల మందికి పైగా రైతులకు పింఛన్ అందిస్తోంది. అయితే ఇది అందరికీ అందుబాటులో లేదు.

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడిన రైతులకు ఈ స్కీమ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పేద రైతులు ఈ పథకంలో చేరితే ప్రయోజనం పొందొచ్చు.హరియాణ రాష్ట్రం టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రం నుంచి 4.5 లక్షల మంది ఈ స్కీమ్‌లో చేరారు. తర్వాత బీహర్ ఉంది. 3 లక్షల మంది ఈ రాష్ట్రం నుంచి మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరారు. తర్వాతి స్థానంలో ఝర్ఖండ్, ఉత్తర ప్రదేశ్ నిలిచాయి. 26 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న రైతులు ఎక్కువగా ఈ పథకంలో చేరారు.
5 ఎకరాలలోపు పొలం కలిగిన వారు పథకంలో చేరొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగి ఉండాలి. నెలకు రూ.55 నుంచి 200 మధ్యలో చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అంటే సంవత్సరానికి రూ.660 చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 కట్టాలి. ఏడాదికి రూ.2,400 చెల్లించాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్, రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, ల్యాండ్ రికార్డ్ తీసుకెళ్లాలి. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్లు దాటితే నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుంది. స్కీమ్‌లో చేరినవారు మరణిస్తే వారి భాగస్వామికి సగం పెన్షన్ వస్తుంది. ఒకవేళ స్కీమ్‌ నుంచి విరమించుకోవాలని భావిస్తే.. అప్పుడు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. సేవింగ్స్ అకౌంట్‌ వడ్డీ రేటు లభిస్తుంది.





Untitled Document
Advertisements