ఉద్యోగులకు గుడ్ న్యూస్: కొత్త పన్ను వ్యవస్థలో పన్ను మినహాయింపులు!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 04:09 PM

ఉద్యోగులకు గుడ్ న్యూస్: కొత్త పన్ను వ్యవస్థలో పన్ను మినహాయింపులు!

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. కంపెనీల నుంచి వేతన జీవులు అందుకునే కన్వీనియన్స్ అలవెన్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ కింద ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందొచ్చని పేర్కొంది.

సీబీడీటీ దీనికి సంబంధించి రూల్ 2బీబీని సవరించింది. దీంతో ఉద్యోగులు సెక్షన్ 10 (4) కింద కన్వీనియన్స్ అలవెన్స్‌పై పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుతం రెండు పన్ను చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే పాత విధానంలో పన్ను కట్టొచ్చు. లేదంటే కొత్త ఆప్షన్ ఎంచుకోవచ్చు.
అయితే కొత్త పన్ను చెల్లింపు విధానంలో మాత్రం పాత విధానంలో మాదిరిగా పన్ను మినహాయింపులు ఏమీ ఉండవు. అయితే ట్యాక్స్ రేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సీబీడీటీ కన్వీనియన్స్ అలవెన్స్ విషయంలో మాత్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పన్ను మినహాయింపు పొందొచ్చని పేర్కొంది.

టూర్/ట్రాన్స్‌ఫర్ అలవెన్స్, డైలీ ట్రావెల్ అలవెన్స్, కన్వీనియన్స్ అలవెన్స్, వికలాంగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి వాటికి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇక్కడ మీల్ కూపన్స్‌కు మాత్రం ఇది వర్తించదు. పన్ను వర్తిస్తుంది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తాయి.





Untitled Document
Advertisements