గుడ్ న్యూస్: ఇంటికి వచ్చి లోన్స్ అందిస్తున్న సంస్థలు

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 05:46 PM

గుడ్ న్యూస్: ఇంటికి వచ్చి లోన్స్ అందిస్తున్న సంస్థలు

లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఇప్పుడు కంపెనీలు ఇంటి వద్దకే వచ్చి రుణాలు అందించడం ప్రారంభిస్తున్నాయి. దేశీ అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్ ఫైనాన్స్ తాజాగా లోన్@హోమ్ సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రుణం తీసుకోవాలని భావించే వారు ఇంట్లో కూర్చొని లోన్ పొందొచ్చు.

Loan@Home సర్వీస్‌లో భాగంగా కంపెనీ ప్రతినిధులు కస్టమర్ల ఇంటి వద్దకే వస్తారు. దీనికి కంపెనీ ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంది. వీళ్లు కస్టమర్ ఇంటి వద్దకు వచ్చి బంగారంపై రుణాలు అందిస్తారు. ఎప్పుడు రుణం తీసుకోవాలనేది ముందు గానే తెలియజేయాలి. దీనికోసం బుకింగ్ చేసుకోవాలి. కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వచ్చి బంగారు ఆభరణాలను చెక్ చేస్తారు. అలాగే లోన్ ఎంత కావాలో అడిగి తెలుసుకుంటారు. లోన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రుణ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కస్టమర్ బ్యాంక్ ఖాతాకు డబ్బులు వచ్చి చేరతాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ ఈ తరహా సేవలు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. దీంతో బంగారంపై రుణాలు తీసుకునే వారు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి వద్ద నుంచే సులభంగా రుణం పొందొచ్చు. కాగా గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే దీని కోసం అప్లై చేసుకోవాలి. లోన్@హోమ్ యాప్ లేదా లోన్@హోమ్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. లేదంటే ఐముత్తూట్ ఫైనాన్స్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ తరహా సర్వీసులు పొందొచ్చు. లేదంటే కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి సర్వీసుల కోసం అప్లై చేసుకోవచ్చు.







Untitled Document
Advertisements