తెలుగు రాష్ట్రాల్లోని ఈ 2 నగరాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 06:03 PM

తెలుగు రాష్ట్రాల్లోని ఈ 2 నగరాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

కరోనా వైరస్‌ (కోవిడ్ 19)కు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు కేంద్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిని (కేజీహెచ్‌) ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది. వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు నోడల్‌ అధికారిగా కేజీహెచ్‌ వైద్యుడు డాక్టర్‌ వాసుదేవ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆయన విమ్స్‌లో కరోనా రోగులకు వైద్యం అందించే విధుల్లో కొనసాగుతున్నారు.

అలాగే, తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చింది. ఇక్కడ పరీక్షలకు నోడల్‌ అధికారిగా డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డిని నియమించింది.





Untitled Document
Advertisements