సునీల్ గవాస్కర్ వరస్ట్ బ్యాట్స్‌మెన్: కిరణ్ మోర్

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 03:27 PM

సునీల్ గవాస్కర్ వరస్ట్ బ్యాట్స్‌మెన్: కిరణ్ మోర్

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తాను నెట్స్‌లో చూసిన వరస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఒకప్పటి అతన సహచరుడు కిరణ్ మోర్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా అప్పట్లో రికార్డు నెలకొల్పిన సునీల్ గవాస్కర్.. కెరీర్ 34 టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. మైదానంలో అద్భుతంగా ఆడే గవాస్కర్ నెట్స్‌లో మాత్రం చెత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని వికెట్ కీపర్ /బ్యాట్స్‌మెన్ కిరణ్ మోర్ గుర్తు చేసుకున్నాడు.
‘మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో అత్యంత చెత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది.. సునీల్ గవాస్కర్. అంత వరస్ట్‌గా ఎవరూ ప్రాక్టీస్ చేయరేమో..? ఒక్కోసారి ఇలా ప్రాక్టీస్ చేసి అతను ఎలా మ్యాచ్ ఆడతాడు..? అని అనిపించేది. కానీ.. మ్యాచ్‌లో నెట్స్‌తో పోలిస్తే 99.9 శాతం భిన్నంగా బ్యాటింగ్ చేసి అబ్బురపరిచేవాడు’’ అని కిరణ్ మోర్ వెల్లడించాడు.

సునీల్ గవాస్కర్ డకౌటైనా ఫీలవ్వడు.. కానీ గంట గంటన్నర క్రీజులో ఉండి 30-40 పరుగుల వద్ద ఔటైతే మాత్రం డ్రెస్సింగ్ రూములో వస్తువుల్ని విసిరికొట్టేసేవాడని కిరణ్ మోర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘సునీల్ గవాస్కర్ డకౌట్ లేదా 5-10 పరుగుల వద్ద ఔటైతే ఏమీ ఫీలవ్వడు. కానీ.. గంట క్రీజులో నిలిచి 30-40 పరుగుల వద్ద ఔటైతే మాత్రం.. డ్రెస్సింగ్ రూములోకి వచ్చి గ్లౌవ్స్‌ని విసిరేసేవాడు. అలా ఎలా ఔటయ్యా..? అంటూ గట్టిగా అరిచేవాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ స్కోర్లు చేయకుండా ఔటవడం అతనికి నచ్చేది కాదు’’ అని కిరణ్ మోర్ వివరించాడు.





Untitled Document
Advertisements