'సుక్కు-అల్లు-దేవి శ్రీ'...మరో రాకింగ్ ఆల్బమ్ రెడీ

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:15 PM

'సుక్కు-అల్లు-దేవి శ్రీ'...మరో రాకింగ్ ఆల్బమ్ రెడీ

అలవైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ లాంగ్ గ్యాప్ తరువాత తన లక్కీ హీరో బన్నీతో ‘పుష్ఫ’ చేస్తున్నారు. అయితే సుకుమార్ కెరియర్ స్టార్టింగ్ నుంచి తన రాకింగ్ ట్యూన్స్‌తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్ కొట్టడం ఖాయమే అని ముందే ఫిక్స్ అయ్యారు అభిమానులు.

అందులోనూ అల్లు అర్జున్-దేవి శ్రీ కాంబోకి మంచి క్రేజ్ ఉండటంతో ‘పుష్ప’ పాటలు రిపీట్ మోడ్‌లో వినేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 1980 నాటి బ్యాక్ డ్రాప్ కథ కావడంతో ఆ నేపథ్యంలో మొత్తం ఐదు సాంగ్స్ ఉండబోతున్నాయట. అయితే సుక్కూ-డీఎస్పీ కాంబో అంటే మ్యూజిక్ ఆల్బమ్ రికార్డుల వేట ఖాయమే.. అందులోని వీరి కొంబోలోని ఐటమ్ సాంగ్‌లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ‘అ.. అంటే అమలాపురం నుంచి జిగేల్ రాణి’ పాట వరకూ అన్ని పాటలు యూట్యూబ్‌ని షేక్ చేశాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా రిపీట్ చేస్తూ.. జానపద నేపథ్యంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ట్యూన్ రెడీ చేశారట దేవి శ్రీ.

ఈ ఐటం సాంగ్‌తో పాటు పుష్ప చిత్రంలో మొత్తం 5 పాటలు ఉండగా వీటి ట్యూన్స్ రెడీ చేసి సుకుమార్‌కి వినిపించారట దేవిశ్రీ. అయితే దేవి శ్రీ ట్యూన్ ఇచ్చాక సుక్కూకి నచ్చకుండా ఉంటుందా.. మొత్తం ఐదు సాంగ్స్ ట్యూన్స్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. దీంతో రికార్డింగ్ పనులకు రెడీ అవుతున్నారట దేవి శ్రీ. ప్రస్తుతం ఈ వర్క్ జరుగుతుండటంతో త్వరలో ‘పుష్ఫ’ పాటలు రానున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌ ‘పుష్ప’హ్యాట్రిక్ చిత్రం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లారీ డ్రైవర్‌గా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు బన్నీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.


పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుక్కూ. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.





Untitled Document
Advertisements