దక్షణాదిలోనే టాప్ హీరోగా ప్రభాస్

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:43 PM

దక్షణాదిలోనే టాప్ హీరోగా ప్రభాస్

‘బాహుబలి’ చిత్రంతో తన క్రేజ్‌ని సెట్ చేసుకుని ఇంటర్నేషనల్ రేంజ్ దక్కించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత ‘సాహో’ నిరాశపరిచినా.. ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదనడానికి అంతకంతకూ పెరుగుతున్న ఆయన ఫాలోవర్సే నిదర్శనం.


ఈ మధ్యనే ఫేస్ బుక్‌లో కోటీ 40 లక్షల ఫాలోవర్స్ రావడంతో దక్షణాదిలోనే ఫస్ట్ ఎవర్ రికార్డ్ సాధించారు ప్రభాస్. అయితే మరో నెల పూర్తి కాకుండానే మరో మిలియన్ ఫాలోవర్స్‌ని రాబట్టి.. 15 మిలియన్ ఫాలోవర్స్‌ని అందుకున్న తొలి దక్షణాది హీరోగా ఈ ‘బాహుబలి’ అవతరించాడు. 13.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో టాప్‌లో ఉన్న అల్లు అర్జున్‌ని బీట్ చేశాడు ప్రభాస్.

ఈ ఫేస్ బుక్ ఫాలోవర్స్ లిస్ట్‌ చూస్తే.. మొత్తంగా ప్రభాస్‌కి ఫేస్ బుక్‌ని 15,063,384 (15 మిలియన్లు) మంది ఫాలో అవుతుండగా.. అల్లు అర్జున్ 13,286,305 (13.2 మిలియన్లు), మహేష్ బాబు 9,664,610 (9.6 మిలియన్లు) రామ్ చరణ్ 8,391,354 (8.3 మిలియన్లు), జూనియర్ ఎన్టీఆర్ 4,473,502 (4.4 మిలియన్లు), విజయ్ దేవరకొండ 3,148,975 (3.1 మిలియన్లు), పవన్ కళ్యాణ్ 788,624 (ఇంకా మిలియన్‌కి చేరుకోలేదు) తరువాత స్థానాల్లో ఉన్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణతో రొమాంటిక్ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకు ఓ డియర్, రాధేశ్యామ్ టైటిల్ ప్రచారంలో ఉన్నాయి. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు ప్రభాస్. ఇక బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రభాస్. ‘అజయ్ దేవగన్’ తానాజీ చిత్రంతో గుర్తింపు పొందిన యువ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు వినికిడి.


Untitled Document
Advertisements