మరో అడల్ట్ కంటెంట్, బోల్డ్ పాపతో ఆర్జీవీ మూవీ!

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 08:08 PM

మరో అడల్ట్ కంటెంట్, బోల్డ్ పాపతో ఆర్జీవీ మూవీ!

కరోనా మహమ్మారి ఉధృతి దేశాన్ని వణికిస్తుండగా సగటు జీవి బ్రతుకు భారంగా మారింది. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు ప్రతీ రంగం దెబ్బతిన్నది. సినిమా రంగంపై ఆ ప్రభావం అధికంగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకూ షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులే కాకుండా వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇలాంటి టైమ్‌ను సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ‌ రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నాడు. రెండు రోజుల్లో సినిమా తీసి, ఖర్చే లేకుండా దాన్ని ప్రమోట్‌ చేసి.. నెట్‌లో విడుదల చేసి తెగ సంపాదిస్తున్నాడు.


తన మాటతీరు, యాటిట్యూడ్‌ మాదిరిగా బోల్డ్‌ కంటెంట్‌తో కుర్రకారును ఆకర్షిస్తున్నాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే ‘క్లైమాక్స్‌’, ‘నగ్నం’ సినిమాలు తీయడమే కాదు రిలీజ్‌ కూడా చేశాడు. మరో అరడజను సినిమాలు అనౌన్స్‌ చేశాడు. అడల్ట్ మూవీస్‌లో ప్రతి సినిమాకి ఓ హాట్ బ్యూటీని పరిచయం చేస్తున్న ఆర్జీవీ ఇప్పుడు అప్సరస లాంటి నటితో ముందుకొస్తున్నాడు. జీఎస్‌టీ, క్లైమాక్స్‌ సినిమాలతో పోర్న్‌ స్టార్ మియా మాల్కోవా, నగ్నంతో అచ్చ తెలుగు అమ్మాయి స్వీటీ అందాలను కుర్రకారుకు పరిచయం చేసిన రాము.. ఇప్పుడు మరో హాట్
బ్యూటీని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాడు. ఆమె పేరు అప్సర రాణి అని వెల్లడించాడు. ఆమె హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. చూడ్డానికి నిజంగానే అప్సరసలా ఉందామె. ‘నా నెక్ట్స్‌ మూవీ ‘థ్రిల్లర్’ సినిమాతో అప్సర రాణి అనే ఏంజెల్‌ని పరిచయం చేస్తున్నాను. ఆమె ఒడిశాలో పుట్టి, డెహ్రాడూన్‌లోని కొండ ప్రాంతంలో పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు అంతకుమించిన డాన్సర్ కూడా. అప్సర రాణిని కలవడానికి ముందు ఒడిశా గురించి నాకు ఏమీ తెలియదు. ఒడిశా అంటే నాకు ఇప్పటి వరకు తెలిసింది 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. అయితే అప్సర రాణిని కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్‌లను సృష్టించగలదని తెలుసుకున్నా. ఒడిశాలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయని అప్సరను కలిసిన తర్వాతే తెలిసింది. ఈ బ్యూటీనే ఇప్పుడు ఒడిశాకు మరింత బలం’ అని వర్మ వరుస ట్వీట్‌స్‌ చేశాడు.
ఫొటోగ్రాఫర్ నవీన్‌ కళ్యాణ్ షూట్‌ చేసిన అప్సర ఫొటో షూట్‌ ఇమేజెస్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. టూ పీస్‌ బికినీతో పాటు మత్తెక్కించే హొయలతో అప్సర అందాలు నిజంగానే యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచేలా ఉన్నాయి. అప్సరతో డిన్నర్ చేస్తున్న ఫొటోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. మరోవైపు ఆర్జీవీ ఇంట్రడ్యూస్‌ చేయడంతో అప్సర రాణికి ట్విట్టర్లో ఫాలోయింగ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నెల ఐదున ఆమె ట్విట్టర్ ఖాతా ఓపెన్‌ చేసింది. ఆర్జీవీ సినిమా అనౌన్స్‌ చేసిన ఏడు గంటల్లోనే ఆమెకు పది వేల మంది ఫాలోవర్లు లభించారు. దీంతో ఉబ్బితబ్బిబైన అప్సర ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది.

Untitled Document
Advertisements