టిక్ టాక్ పేరుతో లింకులు... ఓపెన్ చేస్తే అంతే సంగతులు!

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 08:14 PM

టిక్ టాక్ పేరుతో లింకులు... ఓపెన్ చేస్తే అంతే సంగతులు!

సరిహద్దుల్లో చైనా-భారత్ ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్ ను నిషేధించిన సంగతి తెల్సిందే. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రత దృష్ట్యా కేంద్రం చైనా యాప్స్ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. దీనిని కొందరు సైబర్ నేరగాళ్లు ఆసరా చేసుకొని ఫోన్లను హ్యాక్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘టిక్‌టాక్‌ బ్యాక్ ఎగైన్’ పేరిట మేసేజ్ లను వాట్సాప్ లో పలువురు షేర్ చేస్తున్నారు. ఈ లింకులను ఓపెన్ చేస్తే మీరు తిరిగి వీడియోలు చూడవచ్చనే సందేశం ఉంటుంది. దీనిని ఓపెన్ చూస్తే మొబైల్లోని విలువైన సమాచారం చోరికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మేసేజ్ ల పట్ల అప్రమతంగా ఉండాలని.. వీటిని ఇతరులకు షేర్ చేయద్దని సూచిస్తున్నారు. యాప్స్ డౌన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సప్ లో లేదా సోషల్ మీడియాలో వచ్చే లింకులను మాత్రం ఓపెన్ చేయద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.







Untitled Document
Advertisements