డీఎంకే పార్టీ సీనియర్ నేతకి కరోనా వైరస్

     Written by : smtv Desk | Wed, Jul 08, 2020, 09:01 PM

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా తమిళ నాడు లోని అన్నా డీఎంకే పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి కి కరోనా వైరస్ సోకింది. మంత్రి పి. తంగమని కి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. మంత్రికి కరోనా వైరస్ రావడం పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. అంతేకాక తంగామని ను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించడం జరిగింది.


తమిళ నాడు లో ఇప్పటికే విద్యా శాఖ మంత్రి కి సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అంతేకాక ప్రజా ప్రతి నిధులకు కొందరు మాజీ లకు కూడా కరోనా వైరస్ సోకడం రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. తమిళ నాడులో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో కంటే ఎక్కువగా అక్కడ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ 1,18,594 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,636 మంది కరోనా వైరస్ భారిన పడి మృతి చెందారు.

Untitled Document
Advertisements